* జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రోజుకు 3 జిల్లాల్లో పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఈనెల 24న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ విజయవాడ వస్తారని.. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. ‘‘రాజశేఖర్‌రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావడం… ఆ మాట కోసం పనిచేస్తున్నా. తెలంగాణలో ఓ నియంతను గద్దె దించాం. నా పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడింది. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. నా లక్ష్యం నాకుంది. ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని విలీనం చేశా. ఏపీ నాకు పుట్టినిల్లు.. స్వేచ్ఛగా పనిచేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది’’ అనితెలిపారు.
* హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తోన్న (Israel Hamas conflict) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడున్నర నెలలుగా సాగుతోన్న ఈయుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం (Gaza) వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 178 మంది మరణించగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యారాజ్య సమితి పేర్కొంది.
* ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రణాళిక ఏంటనే విషయంపై రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ‘జనవరి 23 నుంచే మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతాం. నూతన ఉత్సాహంతో 2024 ముగిసేసరికి ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాం. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత వీటిని చేపడతాం’ అని వెల్లడించారు. జనవరి 22 నాటి కార్యక్రమం ఏర్పాట్ల గురించి మాట్లాడిన ఆయన.. యావత్ దేశానికి ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఇవి ఉంటాయన్నారు.
* ‘‘200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి.. నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. వారి మాటలనే నేను గుర్తు చేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విధ్వంసకర మనస్తత్వంగా కనిపిస్తుందట! సోనియా గాంధీకి ప్రజలు కరెంట్ బిల్లులు పంపేలా భారాస ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలి. నిరుద్యోగ భృతిపై తప్పించుకున్నట్లే.. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చింది. పార్టీ కమిటీలు పూర్తి చేయకపోవడం వల్ల నష్టం జరిగింది.. ఇక ముందు అలా జరగదు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌కు భయపడే పార్టీ భారాస కాదు. దిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే గులాబీ పార్టీ గెలవాలి’’ అని కేటీఆర్ అన్నారు.
* జనసేనలో చేరుతున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయనని.. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. 2014లో వైకాపాకు రాజీనామా చేసిన కొణతాల.. ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరికపై ఆయన స్పష్టత ఇచ్చారు.
* కిమ్స్ వైద్యశాలలో మూలుగ మూల కణం మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ నరేందర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాంబియా రాజధాని లుసాకాకు చెందిన 14 ఏండ్ల బాలుడు సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి వచ్చినవారిలో రక్తం తగ్గిపోవడం, విపరీతమైన కీళ్ల నొప్పులతో దైనందిన పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి స్థితిలో జాంబియాలో వైద్య సదుపాయాలు లేకపోవడం, కిమ్స్ వైద్యుల గురించి తెలుసుకున్న బాలుడి తండ్రి.. ఇక్కడికి వచ్చారు. సహజంగా మూలుగ మూల కణం దాతలు ఎవరూ ముందుకు రారు. బాలుడి చెల్లెలు తన అన్నకి మూలకణం ఇచ్చేందుకు ముందుకు రావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. మూల కణం దానం చేసిన చెల్లెలు కూడా సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తురాలేనని, అయితే బాలికకు వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నదని, అతి తీవ్ర స్థాయి నుంచి బాలుడు కూడా ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాడని వైద్యులు తెలిపారు.
* అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే కాంగ్రెస్ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) ప్రజలు బీఆర్‌ఎస్(BRS )వైపే ఉంటారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy )అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయమాటలతో కాలక్షేపం చేస్తుందన ఆరోపించారు. అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిండం ఖాయమన్నారు.
* కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ అభినందన్ హోటల్‌లో వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకుల( BC Leaders) తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5,6 తేదీలలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ లో వేలాది మంది బీసీలతో పార్లమెంట్ ( Parliament ) ను ముట్టడిస్తామని పేర్కొన్నారు. బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ (Narendra Modi) ప్రభుత్వం అణిచివేస్తుందని, మోదీ బీసీల పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. బీసీల హక్కులను పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, సుందరయ్య,నీల వెంకటేశ్,సుధాకర్, రాజ్‌కుమార్, నందగోపాల్, కృష్ణయాదవ్, రాందేవ్, ఉదయ్, రాజేందర్, వాసిరెడ్డి,జయంతిగౌడ్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
* టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ షర్మిల వాడిన భాష, యాస సరికాదు annaaru. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారni kitaabu iccaaru.
* సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటూ రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ రాశారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా?. ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు?. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి. నాగన్‌పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అంటూ ప్రకాశరావు దుయ్యబట్టారు.
* వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు వీలైనంత దగ్గరయ్యేందుకు వచ్చే రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి.. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేవిధంగా.. ఈ బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి రోజు మూడు సభల చొప్పున.. మార్చి నెలాఖరులోగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేశామని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ జోనల్ కమిటీతో నాదెండ్ల మనోహర్ సమావేశమై.. వారికి దిశా నిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలను విజయవంతం చేయాలని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z