Devotional

పార్వతీపురం శ్మశానానికి తెలంగాణ రాజ్యసభ ఎంపీ నిధులు

పార్వతీపురం శ్మశానానికి తెలంగాణ రాజ్యసభ ఎంపీ నిధులు

తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడి నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ స్వర్గధామం అభివృద్ధి చెందుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు స్థానిక వైకాపా ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, అధికార పార్టీకే చెందిన అరకు ఎంపీని పలుమార్లు సంప్రదించారు. వారు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో నిధులు సేకరించి అభివృద్ధి చేయాలని భావించారు. గ్రామం నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్లను సంప్రదించారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న సాలూరుకు చెందిన సుతాపల్లి వెంకటరావు దృష్టికి విషయం తీసుకెళ్లారు. వెంకటరావు ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కు చెప్పి, నిధులు కోరారు. దీనిపై లింగయ్య యాదవ్‌ స్పందించి రూ.10 లక్షలు కేటాయించారు. పుర పాలకవర్గం ఆమోదం మేరకు ఈ నిధులతో స్వర్గధామంలో సీసీ రోడ్డు, ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z