ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చికాగో నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ చికాగో ఆధ్వర్యంలో తారకరామారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనిల్ సుంకర, చంద్రశేఖర్ పెమ్మసాని, రామకృష్ణ గుళ్లపల్లి పాల్గొన్నారు. జ్యోతి ప్రజల్వన అనంతరం ఎన్టిఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. తరాలు మారినా, యుగాలు గడిచిన ఎన్టీఆర్ చరిత్ర తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి యుగంధర్ యడ్లపాటి, చంద్రశేఖర్ పెమ్మసాని, అనిల్ సుంకర అధ్యక్షత వహించగా హేమ కానూరు పర్యవేక్షణలో చికాగో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజనల్ కౌన్సిల్ చిరంజీవి గళ్ళా, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, శివ త్రిపురనేని, కృష్ణ మోహన్, మూర్తి కొప్పాక, సునీల్ ఆరుమిల్లి, కళ్యాణ్ విష్ణు విలాస్, నాగేంద్ర వేగే, ప్రమోద్ చింతమనేని తదితరులు తమ సహాయ సహకారాలు అందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z