కెనడాలో తాకా TACA (Telugu Alliances of Canada) ఆధ్వర్యములో అయోధ్య రామునికి పూజలు నిర్వహించి అక్షింతలను భక్తులకు పంపిణీ చేశారు. నేడు అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం నాడు ఏర్పాటు చేశారు. టోరొంటో నగరంలో శ్రీ శ్రింగేరి విద్యాపీఠం హాలులో అక్షింతల వితరణ కార్యక్రమాన్ని మంజునాథ్ ఆధ్వర్యములో వేదపండితులు నిర్వహించారు. 108 సార్లు శ్రీరాముని నామ స్మరణం చేశారు. జై శ్రీరాం నినాదాలతో రామయ్యను స్మరించారు. తాకా భక్తులకు భోజనాన్ని ఏర్పాటు చేసింది.
తాకా వ్యవస్థాపక సభ్యుల కమీటీ అధ్యక్షులు అరుణ్ కుమార్ లాయం పర్యవేక్షణలో అధ్యక్షుడు మునుకుంట్ల రమేశ్, హనుమంతాచారి సామంతపుడి, కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, ఉపాధ్యక్షులు రాఘవ్ అల్లం, కోశాధికారి మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు విధ్య భవణం, ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, యూత్ డైరక్టర్లు లిఖిత యార్లగడ్డ, రవీంద్ర సామల, ఎక్స్ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ట్రస్టీ బోర్డు అధ్యక్షులు సురేశ్ కూన గారు, ట్రస్టీలు పవన్ బాసని, శృతి ఏలూరి, వాణి జయంతిలు ఏర్పాట్లను సమన్వయపరిచారు. అక్షింతలు భారతదేశంలోని రామజన్మభూమి ఆలయ కమీటీ నుండి కెనడాకు తీసుకువచ్చేందుకు శ్రీనాథ్ కుందూరి, కుమార్ తిరుచిరాపల్లిలు తోడ్పడ్డారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z