* ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.
* వైకాపా మంత్రి రోజాపై అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు.
* శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir)లోని నవ నిర్మిత భవ్య మందిరంలో రామయ్య కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే, ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్ రామ్ (Balak Ram)’గా పిలవనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు.
* ఏపీలో గ్రూప్- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్-1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* తెలంగాణ అమరవీరులకు భారాస నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు క్షమాపణలు చెప్పాలని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు డిమాండ్ చేశారు. కష్టపడేవారికి భారాసలో ఏనాడూ గుర్తింపులేదన్నారు.
* ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల కష్టాలను ఆయన చూశారని చెప్పారు. వైఎస్‌ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు.
* మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో సీజన్ షెడ్యూల్ విడుదలైంది. 2023లోనే డబ్ల్యూపీఎల్ ఆరంభమైన సంగతి తెలిసిందే. దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడగా ముంబయి జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఈసారి కూడా లీగ్‌లో అవే జట్లు తలపడుతున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్ ప్రారంభం కానుంది.
* ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులకు కీలకమైన ‘గోల్డెన్ వీసా (Golden Visa)’ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వీసా ప్రోగ్రామ్ ఆశించిన ఆర్థిక ఫలితాలను ఇవ్వట్లేదని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు తెలిపింది.
* ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న నరేన్ కృష్ణ అనే యువ వ్యాపారవేత్తకు అనూహ్య అనుభవం ఎదురైంది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న అతడు తన పక్క సీట్లోనే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
* విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉండగా.. తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
* వైకాపా(YSRCP)కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైకాపాలో కొంత అనిశ్చితి ఏర్పడిందని.. దానికి తాను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోందన్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు.
* ఏపీలో గ్రూప్- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్-1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ https://psc.ap.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోసారి ఈ గడువును పొడిగించబోమని స్పష్టంచేసింది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరుగుతుందని.. ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z