NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో తెలుగు సాంస్కృతిక ఉత్సవం

హాంగ్‌కాంగ్‌లో తెలుగు సాంస్కృతిక ఉత్సవం

హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించారు. క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతిలను మేళవించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల ఫాన్సీ డ్రెస్, పద్యాలు-శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్-కూచిపూడి నృత్యాలు, వయోలిన్, కీబోర్డ్, తబలా వాయిద్యాల ప్రదర్శన, కర్నాటిక్ సంగీతాలు, అక్షరమాలలో సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం తదితర విభాగాల్లో పిల్లలు తమ ప్రతిభతో మురిపించారు. వ్యాఖ్యాతలుగా రజిత-హర్షితలు వ్యవహరించారు.

ముఖ్య అతిధులుగా హాంగ్‌కాంగ్‌లోని భారత కాన్సులేట్ CGI కె.వెంకటరమణ, స్థానిక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రియా కాంతన్, హాంగ్ కాంగ్ ఆర్ట్అఫ్ లివింగ్ టీచర్ సీమా హిరానందానిలు పాల్గొని అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి కార్యక్రమాన్ని విజయవంఅం చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z