రియల్ ఎస్టేట్ సంకోభం చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలుచేసింది. చాలా తిరోగమనంలో సాగుతోంది. దీంతో కొందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులురకరకాల మార్కెట్ వ్యూహాలతో ఇళ్లను అమ్మే పనిలో పడ్డారు. ఈ ప్రకటనల విషయంలో వారిలోంచి ఎంతలా క్రియేటివిటీ బయటకొస్తుందంటే..నిర్ఘాంతపోయేంత విచిత్రమైన స్థితిలో ఉన్నాయా ప్రకటనలు.తాజగా టియాంజన్‌లోని ఓ కంపెనీ ఎంత విచిత్రమైన రీతీలో అడ్వర్టైస్‌మెంట్ చేసిందంటే..ఛీ అని కచ్చితంగా అంటారు. మరి ఇంత ఘోరమా! అని అనుకుండా ఉండలేరు. ఇళ్లు అమ్ముడుపోవాలని ఏకంగా ‘ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి’ అని అడ్వర్టైస్‌మెంట్ ఇచ్చింది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని మరో కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించిందట. ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు గానీ మరీ ఇలా భార్యలేంటి అని అందరూ సీరియస్ అయ్యారు. పైగా ఇది చైనీస్ రెగ్యులేటర్‌లకు కూడా నచ్చలేదట. ఇలా ప్రకటన ఇచ్చినందుకగానూ సదరు కంపెనీకి రూ. 3 లక్షల దాక జరిమాన విధించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z