చదివింది 8వ తరగతే అయినా.. కోట్లలో సంపాదిస్తున్నాడు. ఐఐటీ గ్రాడ్యుయేట్ల కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నాడు. వ్యవసాయం చేయడమంటే కొందరు అదేదో పనికిరాని పని అని చూసే ఈ రోజుల్లో వినూత్న వ్యవసాయ పద్దతులను ప్రవేశపెట్టి.. పండించిన పంటను ప్రపంచ మార్కెట్లో అమ్ముకుంటూ .. అందరూ ఔరా అనేలా ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంవత్సరానికి పెద్ద మొత్తాన్ని వెనకేసుకుంటున్నాడు. నిబద్ధత కలిగిన రైతుగా అద్భుతమైన విజయాన్ని సాధించాడు. వ్యవసాయమే దండగా అనుకుంటున్న యువతకు గుజరాత్ కు చెందిన ధర్మేష్ భాయ్ మాతుకియా ..వ్యవసాయం ద్వారా కూడా వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదించొచ్చు అని నిరూపించాడు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లోని అమ్రేలీ జిలలా అమ్రాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ భాయ్ మాతుకియా అనే యువకుడు.. వినూత్న పద్దతుల్లో వ్యవసాయం చేస్తూ.. పండించిన పంటను ప్రపంచ మార్కెట్లో అమ్ముతూ.. కోట్లలో సంపాదిస్తున్నారు. తనకు 20 ఎకరాల వ్యవసాయ భూమిలో మిర్చి సాగు చేసిన ధర్మేష్.. సంవత్సరానికి 60 వేల కిలోల గణనీయమైన దిగుబడిని పొందుతున్నారు. తన మిర్చి పంటను మిర్చి పొడిగా ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్లోకి ఎగుమతి చేస్తున్నాడు. ఫలితంగా సంవత్సరానికి రూ. 1.50 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు.
8వ తరగతి వరకు చదువుకున్న 45 యేళ్ల ధర్మేష్ భాయ్.. గత ఐదేళ్లుగా మిర్చి సాగు చేస్తున్నారు. కాశ్మీరి డబ్బి వంటి రకాల మిర్చి పండించడం ఆయన ప్రత్యేకత. పండిన పంటలో కొంత మిర్చి రూపంలో, కొంత పౌడర్ చేసి విక్రయిస్తున్నారు ధర్మేష్. కాశ్మీరీ మిర్చి ఫౌడర్ కిలో రూ. 450 లు పలుకుతుండగా.. కాశ్మీరి మిర్చి కిలో రూ. 350 లు పలుకుతోంది. ఈ కారంపొడిని అమెరికా సహా వివిధ దేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు. దీంతో ధర్మేష్ సంవత్సరాదాయం రూ. 1.5 కోట్లకు చేరింది. వ్యవసాయ కూలీ వంటి ఖర్చులు తీసివేయగా మొత్తం అతని ఆదాయం రూ. 90 లక్షలు. అందుకు అన్నారు పెద్దలు.. కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని.. చదువు లేకున్నాకూడా కోట్లు సంపాదించొచ్చని.. మంచి పొషిషన్ కి రావొచ్చని..తన కు నచ్చిన రంగంలో కృషి చేస్తే చదువు లేకున్నా కూడా ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని నిరూపించిన ధర్మేష్ .. యువతకు ఆదర్శం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z