2023-24 తానా ఎన్నికలు నిర్వహించిన ElectrionTrust, Votegrity సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా బోర్డు మాజీ అధ్యక్షుడు కోయా హరీష్, తానా బోర్డు మాజీ సభ్యుడు జరుగుల శ్రీనివాస్‌లు తమ లాయర్ ద్వారా ఈ రెండు సంస్థలకు ఈమెయిల్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు.
ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన 2023-24 తానా ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలంటే ఓటరుకు తానా నుండి అందిన కోడ్‌తో పాటు ఓటరు సెల్‌ఫోన్‌కు వచ్చే OTPను అనుసంధానించి ఓటుహక్కును వినియోగించాలి. కానీ లీగల్ నోటీసులు పంపిన వాదులు ముగ్గురు తమ ఓటు తాము వేయలేదని, ఓటు హక్కు వినియోగించేందుకు ప్రయత్నించగా తమ ఓటు అప్పటికే వేసినట్లు ఉందని, తమకు తెలియకుండా తమ ఓటును ఎవరు వేశారో తెలుసుకునేందుకు వీలుగా అన్ని ఆధారాలు, సమాచారాన్ని, డేటాబేస్లను, ఎలక్ట్రానిక్ వివరాలను భద్రంగా ఉంచాలని కోరారు. తమతో పాటు అమెరికా-కెనడాల్లోని చాలా మంది తానా ఓటర్లు కూడా తమ లానే తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారని నోటీసులో పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణలో భాగంగా కోర్టు జోక్యాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పూర్తి నోటీసు దిగువ చూడవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z