15మంది ప్రవాసులను ₹16 కోట్ల రూపాయిల మేర మోసగించిన ఆర్థిక నేరంలో అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం కారీకి చెందిన ప్రవాస తెలుగు వ్యక్తి నెప్పల్లి అరుణ్‌కుమార్‌కు స్థానిక కోర్టు 44నెలల జైలు శిక్ష $8 కోట్ల జరిమానా విధించింది.
స్థానిక రవాణా శాఖలో ఇంజినీరుగా పనిచేస్తున్న అరుణ్ ట్రియాంగిల్ ఏరియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2017-21 మధ్య కాలంలో 15మంది వద్ద నుండి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి పెట్టుబడి పెట్టకుండా ఇతరులకు చెల్లింపులు చేశాడనే అభియోగాన్ని ఆయన మంగళవారం నాడు కోర్టులో అంగీకరించినందుకు గానూ శిక్ష ఖరారు అయింది. దివాళా తీస్తున్నట్లు అరుణ్ ప్రకటించగానే అతనికి డబ్బులిచ్చిన వారు ఫిర్యాదు చేయడంతో ఈ డొంక కదిలింది. స్థానిక భారతీయ సమాజంతో అరుణ్ తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేసి వారి కష్టార్జితాన్ని అక్రమంగా దిగమింగాడని ప్రభుత్వ లాయర్లు కోర్టు వాదనల సందర్భంగా పేర్కొన్నారు.
Justice Department Link:
https://www.justice.gov/usao-ednc/pr/cary-man-indicted-23-counts-wire-fraud-and-money-laundering-ponzi-scheme
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z