* గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది.
* తెలంగాణాలో ఎంసెట్ పేరు మారింది. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET 2024)గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (TS EAP CET)సహా ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ఈ ప్రవేశ పరీక్షలకు ఆధ్వర్యం వహించే యూనివర్సిటీల వివరాలివే..
తెలంగాణ ఈసెట్ – మే 6 – ఉస్మానియా యూనివర్సిటీ
టీఎస్ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్)- మే 9 నుంచి 11 వరకు; (అగ్రికల్చరల్ అండ్ ఫార్మా) మే 12, 13 తేదీల్లో – జేఎన్‌టీయూహెచ్
టీఎస్ ఎడ్‌సెట్ – మే 23 – మహాత్మాగాంధీ యూనివర్సిటీ
టీఎస్ లా సెట్; పీజీఎల్‌సెట్ – జూన్ 3 – ఉస్మానియా యూనివర్సిటీ
టీఎస్ ఐసెట్ – జూన్ 4, 5- కాకతీయ యూనివర్సిటీ
టీఎస్ పీజీఈసెట్ జూన్ 6 నుంచి 8వరకు – జేఎన్‌టీయూహెచ్
టీఎస్ పీఈసెట్ – జూన్ 10 నుంచి 13 వరకు – శాతవాహన యూనివర్సిటీ
* కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ (Congress)అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు.. హామీలు అమలు ఎక్కడ అని భారాస నేతలు అడుగుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. భారాస ఇచ్చిన హమీలు అమలు చేశారా? పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును.. తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే ani rEvaMt annaaru.
* బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ కలిసి పనిచేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి, ఎన్నికల కోసం అంతా కలిసి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని, కష్టపడి పనిచేయాలని కోరారు. ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు.
* రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇలా అబద్ధాలు చెప్పినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
* ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉందా? లేదా? అని సరి చూసుకోవాలన్నారు. ఓటు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
* తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి (Mahender Reddy)ని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించారు.
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొనసాగిస్తున్న ‘భారత్ జోడో న్యాయయాత్ర’ (Bharat Jodo Nyay Yatra) గురువారం అస్సాం నుంచి పశ్చిమబెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల మీదుగా యాత్రను త్వరగా ముగించి బిహార్ (Bihar) రాష్ట్రంలోకి వెళ్లేలా మార్గాన్ని మార్చారు. వారం రోజుల్లోగా ‘న్యాయయాత్ర’ మళ్లీ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
* రైలు ప్రమాదాల నివారణకు అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థ (Kavach System) వేగంగా ప్రయాణించే సమయంలోనూ మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు ఉత్తర మధ్య రైల్వే (North Central Railway) తెలిపింది. గత వారం హరియాణాలోని పల్వాల్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర స్టేషన్ల మధ్య నడిచే సెమీ-హైస్పీడ్ రైలులో ఈ వ్యవస్థను ఏర్పాటుచేసి పరీక్షించినట్లు ఆగ్రా రైల్వే డివిజన్ ప్రతినిధి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. గంటకు 160 కి.మీ. వేగం వద్ద ఇది సమర్థంగా పనిచేసిందని ఒక ప్రకటనలో వెల్లడించారు.
* ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని భారాస ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రఘునందన్ రావు అర్థం లేని ఆరోపణలు చేయడం.. ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. మంత్రి హరీష్ రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.
* భారత్-ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది. భారత్ ఇన్నింగ్స్ ఆరంభ సమయంలో స్టాండ్స్‌లో నుంచి ఓ అభిమాని.. మైదానంలోకి పరిగెత్తుకు వచ్చి రోహిత్ శర్మ (Rohit Sharma) కాళ్లకు మొక్కాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు.
* పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారాస మనుగడ ప్రశ్నార్థకమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (UttamkumarReddy) జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు భారాస పోటీ కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 13-14 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z