ప్రముఖ సెర్చింజన్ గూగుల్ లుమియర్ (LUMIERE) పేరుతో అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. దీంతో సులువుగా వీడియో క్రియేట్ చేయొచ్చని పేర్కొంది. టెక్ట్స్ -టు వీడియో, ఇమేజ్ -టు వీడియో, వీడియో ఇన్ పెయింటింగ్ లాంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను గూగుల్ ఏఐ తన అధికారిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. స్పేస్-టైమ్ U నెట్ ఆర్కిటెక్చర్‌తో లుమియర్ ఏఐ పనిచేస్తుంది. వీడియో రూపొందించడాన్ని ఇది సులభతరం చేస్తుంది. మీరు రూపొందించాలనుకున్న అంశానికి సంబంధించిన టెక్ట్స్‌ను అందిస్తే చాలు ఈ ఏఐ వీడియోని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు.. ‘చిన్న పిల్లవాడు పొలాల మధ్య పరిగెత్తున్నాడు’ అని టెక్ట్స్ ఇస్తే చేస్తే అలాంటి వీడియోను రెడీ చేస్తుంది. ఏ ఫొటోతోనైనా వీడియో రూపొందించేందుకు ఇది సాయపడుతుంది. వీడియో స్టైలైజేషన్, సినిమాగ్రాఫ్స్, వీడియో పెయింటింగ్‌తో పాటు అనేక టూల్స్ ఇందులో ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z