* రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
* టెక్ ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల పేరిట టెక్ దిగ్గజాలు మెటా, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ సహా పలు కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. కొలువుల కోత ఎప్పుడు తమకు ఎసరు పెడుతుందనే గుబులుతో టెకీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక లేఆఫ్స్‌పై అమెజాన్ ఉన్నతాధికారి బాంబు పేల్చారు. లేఆఫ్స్ ఉండవని చెప్పేందుకు అమెజాన్ ఆడిబుల్ సీఈవో బాబ్ కరిగన్ నిరాకరించారు. లేఆఫ్స్ ఉండవని చెప్పకపోవడం ద్వారా అమెజాన్ యూనిట్లో మరిన్ని కొలువుల కోతలు ఉండవచ్చనే సంకేతాలు పంపారు. కంపెనీ ఇటీవల 5 శాతం ఉద్యోగులను తొలగించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం టెకీల్లో కలవరం కలిగిస్తోంది.
* ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) వచ్చేనెలాఖరులో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. తొలిసారి మీడియా టెక్ డైమెన్సిటీ 7020 చిప్ సెట్ తో వస్తున్నది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది.
* రియల్ ఎస్టేట్ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్ (లోధ) ఎనలిస్టుల అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో రూ. 505 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.405 కోట్లతో పోలిస్తే 25 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ.370 కోట్లు ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. మాక్రోటెక్ డెవలపర్స్ రెవెన్యూ (కార్యకలాపాలు) 65 శాతం పెరిగి రూ. 1,774 కోట్ల నుంచి రూ.2,930 కోట్లకు ఎగసింది. రూ.2,459 కోట్ల రెవెన్యూ వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు.
* సంవత్సరంలో రెండవ నెల అయిన ఫిబ్రవరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. 2024 ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఫిబ్రవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందులో రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయి. ఈ బ్యాంకు సెలవుల్లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినవి, ఇంకొన్ని జాతీయ సెలవు దినాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులను మూడు బ్రాకెట్ల కింద పెడుతుంది. అవి.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడేస్ కింద సెలవులు, బ్యాంకుల ఖాతాల మూసివేత.
ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవుల వివరాలు..
4 ఫిబ్రవరి: ఆదివారం
10 ఫిబ్రవరి: రెండవ శనివారం / లోసార్‌లో- గ్యాంగ్‌టక్‌లోని బ్యాంక్‌లకు సెలవు
14: వసంత పంచమి / సరస్వతీ పూజ (శ్రీ పంచమి)- అగర్తలా, భువనేశ్వర్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు.
15 ఫిబ్రవరి: లుయి-ఎన్‌గై ని- ఇంఫాల్‌లోని బ్యాంకులకు సెలవు.
18 ఫిబ్రవరి: ఆదివారం
19 ఫిబ్రవరి : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి- బేలాపూర్, ముంబై, నాగపూర్ లో బ్యాంకులకు సెలవు.
20 ఫిబ్రవరి: ఐజ్వాల్ లో బ్యాంకులకు సెలవు.
24 ఫిబ్రవరి: రెండో శనివారం
ఫిబ్రవరి 25: ఆదివారం
ఫిబ్రవరి 26: నైకూమ్- ఇటానగర్ లో బ్యాంకులకు సెలవు
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z