Devotional

సోమవారం రాశి ఫలాలు-January 29 2024

సోమవారం రాశి ఫలాలు-January 29 2024

29-1-2024 సోమవారం రాశి ఫలాలు

* మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి చూపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు.ప్రయాణాల్లో నూతన మిత్రులు కలయిక. గృహమునకు కావలసిన సామాగ్రి సమకూర్చుకుంటారు. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉండును. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యముగా అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక అవసరాలను బట్టి ఖర్చు చేయవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరంగా ఉండాలి. మనస్సులో ఆందోళన. ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. సోదరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
కుటుంబం నందు శుభకార్యాలు జరుగును. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. స్తంభించిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారం అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. భూ గృహ కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు కలసి వస్తాయి.ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం.చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సంఘం లో తెలివిగా వ్యవహరించడం వలన మీ పనులు సజావుగా పూర్తి కాగలవు.ఆర్థికంగా బలం చేకూరుతుంది.సంతాన మూలకంగా లాభం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది.ఈ రాశి వారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక. సంఘం లో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా శారీరకంగా బలపడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారు ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

* తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు. కొత్త ఆలోచనలు కలసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. మొండి బాకీలు వసూలు అవును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు.ఈ రాశి వారు మహాలక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల తో సఖ్యత గా ఉండవలెను.ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది .వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కొంతమేర రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ రాశి వారు ఓం అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
శుభవార్తలు వింటారు.స్తంభించిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పై అధికారులు ఆదర అభిమానం పొందగలరు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు. నూతన వ్యాపార ఆలోచనలు కలసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం పరమేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
ఆదాయానికి మించిన ఖర్చులు. మానసిక ఆందోళన. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం తగదు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. మీ యొక్క శక్తిసామర్థ్యాలు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు. వినరాని విషయాలు వినవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం. చెడు స్నేహం వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగాలలో పై అధికారుల వలన చికాకులు. . వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.ఈ రాశి వారు ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

* మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. అనుకున్న పనులు లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభం. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాలు అన్వేషించండి. శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z