NRI-NRT

మూడో ప్రపంచ యుద్ధం అంచున

మూడో ప్రపంచ యుద్ధం అంచున

మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల పశ్చిమాసియాలోని బోర్డాన్‌లో మిలిటెంట్‌ గ్రూపులు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను అమెరికా చాలా సీరియస్‌గా తీసుకుంది. దీటుగా సమాధానం ఇస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఈ పరిణామాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ అగ్రరాజ్యానికి ఇదొక భయంకరమైన రోజుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా బైడెన్ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అమెరికా బలహీనంగా ఉందని.. మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z