* ఎన్ఆర్‌ఐ యశస్వి (NRI Yashasvi)కి ఏపీ హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. తనపై సీఐడీ (CID) ఇచ్చిన లుక్ ఔట్ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత లుక్ ఔట్ నోటీసు కొనసాగించటం ఆర్టికల్ 21కి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, కొట్టివేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం సీఐడీ జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
* హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంగళవారం మధ్యాహ్నం కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయసు 30 ఏండ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో పలు ఆధారాలను సేకరించారు. అక్కడున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతన్ని ఎక్కడో చంపి, ఇక్కడ పడేసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
* రోడ్డుపై నిలిచిపోయిన లారీని మరమ్మతులు చేస్తుండగా మరో టిప్పరల్ లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఏపీలోని కోనసీమ జిల్లా (Konaseema District) రావులపాలెంలోని గౌతమి కొత్త వంతెనపై అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. వంతెనపై లారీ ఆగిపోవడంతో లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి మరమ్మతులు (Lorry Repair) చేస్తుండగా టిప్పర్ లారీ అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
* హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో గంజాయి చాకెట్లు కలకలం (Ganja Chocolates) సృష్టించాయి. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్యా రాజన్‌గా గుర్తించారు. అతని నుంచి 40 గంజాయి ప్యాకెట్లను సాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు చాక్లెట్లను అమ్ముతుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు చేస్తున్నామని చెప్పారు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయమై ఆరాతీస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z