Business

మారుతీని ఓవర్‌టేక్ చేసిన టాటా

మారుతీని ఓవర్‌టేక్ చేసిన టాటా

భారత వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ సరికొత్త ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా అవతరించింది. డీవీఆర్‌ షేర్లు, కంపెనీ మార్కెట్ విలువ పరంగా మారుతీ సుజుకీని అధిగమించింది. టాటా మోటార్స్‌ విలువ రూ.2,85,515.64 కోట్లు, టాటా మోటార్స్‌ లిమిటెడ్ డీవీఆర్‌ విలువ రూ.29,119.42 కోట్లతో కలిపి మొత్తం రూ.3,14,635.06 కోట్ల మార్కెట్‌ విలువతో ఆటోమొబైల్ కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రూ.3,13,058.50 కోట్లతో మారుతీ సుజుకీ రెండో స్థానానికి పరిమితమైంది. మార్కెట్‌ ముగిసే సమయానికి టాటా మోటార్స్‌ షేరు 2.19 శాతం పెరిగి రూ.859.25 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్‌ లిమిటెడ్ డీవీఆర్‌ షేర్లు 1.63శాతం పెరిగి రూ. 572.65కు చేరాయి. ఇంట్రాడేలో రూ.886.30 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరాయి. అదే సమయంలో మారుతీ సుజుకీ షేర్లు 0.36 శాతం నష్టంతో రూ.9,957.25 వద్ద ముగిశాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z