Politics

ఏపీలో గందరగోళంగా ఉంది. మోడీకి షర్మిల లేఖ.

ఏపీలో గందరగోళంగా ఉంది. మోడీకి షర్మిల లేఖ.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)కి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదని అంశాల వారీగా‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై మీ దృష్టికి తీసుకువస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. విభజన జరిగిన ఒక దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎన్నికల వాగ్దానాలను అమలు పరచలేదని వివరించారు.పదేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారనేది వాస్తవమని చెప్పారు. నేడు, రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z