Health

మెనోపాజ్ లానే పురుషుల్లో ఆండ్రోపాజ్

మెనోపాజ్ లానే పురుషుల్లో ఆండ్రోపాజ్

స్త్రీలలో మెనోపాజ్ అనగానే నెలసరి ఆగిపోవడం. అయితే పురుషులకు ఇలాంటి సమస్య ఉండదు కాబట్టి వారికి మెనోపాజ్ రాదు అనుకుంటారు. నిజానికి మగవారికి కూడా వస్తుంది. దీన్ని ఆండ్రోపాజ్ అని పిలుస్తారు. వారి వయసు పెరుగుతున్న కొద్దీ ఇది ఏదో ఒక సమయంలో సంభవిస్తుంది. మగవారిలో మెనోపాజ్ వస్తే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. అంగస్తంభన సమస్య పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. బరువు పెరుగుతారు. డిప్రెషన్ బారిన పడతారు. ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇవన్నీ వారు మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నారని చెప్పే లక్షణాలు. మగవారిలో మెనోపాజ్ 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వస్తుంది. ఎక్కువగా 45 ఏళ్ల వయసులో వారికి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ఆడవారిలో మెనోపాజ్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మగవారిలో ఆండ్రోపాజ్ వచ్చినా కూడా అలానే ఉంటాయి. ఆండ్రోపాజ్ దశలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు చాలా త్వరగా తగ్గిపోతాయి. 70 ఏళ్ల వయసు వచ్చేసరికి టెస్టోస్టెరాన్ స్థాయిల్లో దాదాపు 50 శాతం పడిపోతాయి. అందుకే ఆ వయసులో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. శారీరకంగా బలహీనంగా ఉంటారు. మెదడు సవ్యంగా పనిచేయదు. టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడం వల్ల వారిలో లైంగిక శక్తి తగ్గిపోతుంది. లైంగిక ప్రక్రియకు టెస్టోస్టెరాన్ చాలా ముఖ్యమైనది. దాని స్థాయిలో తగ్గుదల ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీకు ఆ వైపుగా ఆలోచనలు రావు. అలాగే మగవారిలో ఆండ్రోపాజ్ దగ్గర పడుతున్నప్పుడు అంగస్తంభనకు దారితీస్తుంది. దీనివల్ల వారు లైంగిక ప్రక్రియను నిర్వహించలేరు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం ఆండ్రోపాజ్ దశలో ముఖ్యమైన భాగమే. ఇది ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే శక్తి స్థాయిలు చాలా మేరకు తగ్గిపోతాయి. త్వరగా అలసిపోతారు. నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. నిద్రలేమి వంటి సమస్యల బారిన పెడతారు. ఏ విషయాన్ని ఏకాగ్రతగా వినలేరు. చికాకు, కోపం త్వరగా వస్తాయి. మానసికంగా చాలా కల్లోలంగా ఉంటారు. ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z