DailyDose

TV5 సాంబశివరావుపై ఛీటింగ్ కేసు-నేరవార్తలు

TV5 సాంబశివరావుపై ఛీటింగ్ కేసు-నేరవార్తలు

* ఇంట్లో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను ఒక మహిళ గుర్తించింది. (spy camera at woman’s house) దీని ద్వారా తనను వీడియో తీసినట్లు ఆమె అనుమానించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డెంటల్‌ స్టూడెంట్‌ను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ తన భర్తతో కలిసి మూడేళ్లుగా ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నది. జనవరి 30న ఆమె ఇంటిని శుభ్రం చేస్తుండగా ఒక పెన్ను మాదిరి పరికరం నుంచి రెడ్‌ లైట్‌ రావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది.

* నిత్యం టీవీ5 వేదికగా తాను వల్లించేవి రాజకీయ ప్రవచనాలుగా ఫీలయ్యే సాంబశివరావు పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు cESAru. మీడియా వృత్తితో పాటు సాంబశివరావు పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూస్థాన్ పెట్రోలియంకు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారన్నది ప్రధాన అభియోగం. టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితుల ఆరోపణ.

* అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారంటూ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్‌ శ్రీకాంత్ సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమేష్‌కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించిన శ్రీకాంత్‌.. ఆయనకు గుర్‌గావ్‌లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయన్నారు. నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని శ్రీకాంత్ అంటున్నారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారన్న శ్రీకాంత్‌.. యాచారంలో సోమేష్‌కుమార్‌ భార్య పేరిట 25 ఎకరాల భూమిని కొన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.

* తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో మరో ముగ్గురిని సీఐడీ అరెస్ట్‌ చేసింది. ఆదిలాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పని చేసే ప్రణబ్, ఎస్‌బీ ఏఎస్‌ఐ లక్ష్మణ్‌తో పాటు మరొకరు అరెస్టయ్యారు. మరో పాస్‌పోర్టు ఏజెంట్‌ను ముంబైలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీలంక వాసులకు 95 పాస్‌పోర్టులు జారీ అయినట్లుగా సీఐడీ గుర్తించింది. 95 మంది వివరాలను పాస్‌పోర్ట్ అధికారులతో పాటు ఇమీగ్రేషన్ అధికారులకు సీఐడీ సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఐదు మందిని కస్టడీకి తరలించి సీఐడీ విచారణ చేపట్టింది. ఇంకా అరెస్ట్‌లు పెరిగే అవకాశం ఉంది.

* హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్ నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన బిక్కి అశోక్‌గా పోలీస్ గుర్తించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z