పూనమ్ కౌర్ కి అరుదైన వ్యాధి సోకిందట. ఈ విషయాన్ని పూనమ్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. పూనమ్ కౌర్ కి సోకిన వ్యాధి ఫైబ్రోమయాల్జియా. సమంతకి సోకినా మాయోసైటిస్ కి కాస్త దగ్గర లక్షణాలు ఉంటాయి.
ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుంది. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయి. శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ ని, కండరాలని డ్యామేజ్ చేయదు కానీ.. నొప్పులకు కారణం అవుతుంది. ముఖ్యంగా నిద్రపోయి లేచిన తర్వాత శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి. నిద్ర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అసందర్భమైన నిద్రకు ఈ వ్యాధి కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి మహిళలకు సోకుతుంది. 18 ఏళ్ళు పైబడిన వారు ఈ వ్యాధికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధితో పూనమ్ కౌర్ మూడేళ్ళుగా నరకం అనుభవిస్తున్నట్లు చెబుతోంది. కనీసం బట్టలు వేసుకోవడం కూడా కుదరడం లేదట. అంత తీవ్రంగా ఈ వ్యాధి ఉన్నట్లు పూనమ్ చెబుతోంది. గతంలో పూనమ్ ఈ వ్యాధి కోసం కేరళలో ఆయుర్వేద వైద్యం ప్రయత్నించిందట.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z