తిరువూరు మీడియా సమావేశంలో తెదేపా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడారు. వైసీపీ నుంచి టిడిపికి 100 కుటుంబాలు రావటం శుభసూచకం అన్నారు. వైకాపా ఖాళీ అవుతుందని టిడిపిలో చేరేందుకు వారు ఆసక్తి చూపిస్తున్నారని చిన్ని అన్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి వెళ్ళిపోయారు. కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. 3లక్షల మెజార్టీతో గెలుస్తాం అని చిన్ని ధీమా వ్యక్తపరిచారు. టీడీపీలో పదవులు పొంది, ఇప్పుడు పదవులు రావటం లేదని చంద్రబాబుపై బురద జల్లుతున్నారని చిన్ని విమర్శించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడు స్థానాలు గెలుస్తామన్నారు. జనసేన-టిడిపి నాయకులందరూ సమిష్టిగా కృషిచేసి 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z