Business

ఎస్‌బీఐ నష్టం ₹4592కోట్లు – వాణిజ్య వార్తలు

ఎస్‌బీఐ నష్టం ₹4592కోట్లు – వాణిజ్య వార్తలు

* కొవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన లేఆఫ్‌ల పర్వం ఇంకా కొనసాగుతోంది. చిన్నా, పెద్ద కంపెనీలు అన్న తేడా లేకుండా గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది కూడా తొలగింపులను కొనసాగిస్తున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఒక్క 2024 జనవరిలోనే 30వేల మంది ఉద్యోగులను పలు కంపెనీలు తొలగించాయి. ఫిబ్రవరి 3 వరకు 122 టెక్‌ కంపెనీలు 31,751 మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపాయి.

* ప్రముఖ వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’ ఇటీవల ఒక వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ…ఇలాంటి యంత్రాలను తయారు చేయడానికి ఎవరైనా సిద్ధమైతే పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ…ట్వీట్ చేశారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రాను అంతగా ఆకర్శించిన ఆ యంత్రం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఆటోమాటిక్ రోబోట్ వంటి యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను శుభ్రం చేస్తోంది. ఆ యంత్రం ఎలా పనిచేస్తుందనేది కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. నదులను శుభ్రపరిచే ఆటోమాటిక్ రోబో. ఇది చైనాలో తయారైనట్లు ఉంది. ఇలాంటివి ఇప్పుడు మనం కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి యంత్రాలకు సంబంధించి ఎవరైనా స్టార్టప్‌ ప్రారంభించాలనుకుంటే పెట్టుబడి నేను పెడతానని ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఆటోమాటిక్ యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను లోపలికి లాక్కుంటోంది. ఇలాంటి యంత్రాలు మనదేశంలో ఉండే నదులను, జలాశయాలను శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

* దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాభాలు భారీగా పతనమయ్యాయి. శనివారం ప్రకటించిన FY24 క్యూ3 త్రైమాసికంలో SBI లాభం ఏకంగా 35 శాతం కోల్పోయి రూ.9,163 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇది గత సంవత్సరంతో పోల్చితే రూ.4592 కోట్లు తక్కువగా ఉండటం విశేషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రితం సంవత్సరం రూ. 14,205 కోట్లు లాభాలను ఆర్జించింది. అధిక పెన్షన్ ఖర్చులు, సిబ్బంది వేతన సవరణల కోసం రూ.7,100 కోట్లు ఖర్చయిన నేపథ్యంలో లాభం తగ్గిందని SBI తెలిపింది.

* అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వచ్చే ఏడాదిలో కంపెనీకి చెందిన 50 మిలియన్ల (5 కోట్ల) షేర్లను విక్రయించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో షేరుకు 171.8 డాలర్లుగా ఉన్నది. అమెజాన్‌ షేర్ల మొత్తం విలువ 8.6 బిలియన్ డాలర్లు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. షేర్ల విక్రయానికి సంబంధించిన ప్రణాళిక గతేడాది 8న మొదలైంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన అమ్మకాలు నమోదవగా.. అమెజాన్ షేర్లు శుక్రవారం దాదాపు 8శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి గత త్రైమాసికంలో అమెజాన్ ఆన్‌లైన్ అమ్మకాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. గత ఏడాది అమెజాన్ షేర్లు 80 శాతానికిపైగా పెరిగి బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ను అధిగమించాయి. బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బెజోస్ ప్రస్తుతం 185 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ మాజీ భార్య మకెంజీ స్కాట్ సైతం గతేడాది అమెజాన్‌లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్‌లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు. ఆ సమయంలో మెకెంజీ స్కాట్‌కి అమెజాన్‌లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు. దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

* జియో ఎయిర్‌ఫైబర్ అదనపు డేటా కోసం ఏదైనా బేస్ ప్లాన్‌కి యాడ్ చేసే 3 డేటా బూస్టర్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ రూ. 101 ప్లాన్ : ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన స్పీడ్‌తో 100జీబీ అదనపు డేటాను అందిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ రూ. 251 ప్లాన్ : ఈ ప్లాన్‌తో మీ బేస్ ప్లాన్ మాదిరిగానే అదే వేగంతో 500జీబీ అదనపు డేటాను పొందవచ్చు.
జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ రూ. 401 ప్లాన్ : మీ బేస్ ప్లాన్ మాదిరిగానే అదే స్పీడ్‌తో 1000GB డేటా టాప్ అప్ పొందవచ్చు.
ఈ డేటా బూస్టర్ ప్లాన్‌లకు సొంత వ్యాలిడిటీ లేదని గమనించాలి. ఈ ప్లాన్లను యాక్టివేట్ చేయడానికి బేస్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు కొత్త జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌తో లేదా నెలవారీ ప్లాన్‌గా ఉపయోగించవచ్చు. మీరు ఒకే బిల్లింగ్ సైకిల్‌లో అనేక సార్లు ఈ డేటా బూస్టర్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయవచ్చు. అదనంగా, డేటా బూస్టర్ ప్లాన్‌ల స్పీడ్.. మీ జియోఎయిర్ ఫైబర్ బేస్ ప్లాన్ స్పీడ్ అందిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z