మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి, మలేషియా కౌలాలంపూర్ లో సోమా ఆడిటోరియం హాల్, కౌలాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మలేషియా లో ని తెలుగువారు హాజరయ్యారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా ఇండియన్ హై కమిషనర్ శ్రీ బి న్ రెడ్డి గారు మరియు ప్రసిద్ధ తెలుగు సినిమా గాయకుడు,సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్, డాక్టర్ ప్రకాష్ రావు ప్రెసిడెంట్ తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, పిరమిడ్ అండ్ మెడిటేషన్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ న బి లచ్చు సీఈఓ పైడా ఇంటర్నేషనల్ , ఇతర సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఇండియన్ హై కమిషనర్ శ్రీ బి న్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ వారిని అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందం వెల్లి విరియాలని అయన ఆకాంక్షించారు.అలాగే సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వందేమాతరం శ్రీనివాస్ గారు పాడిన పాటలు ప్రధాన ఆకర్షణగా ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పాడుతా తీయగా ఫేమ్ మాస్టర్ సార్థక్ మరియు స్టార్ మా సూపర్ సింగర్ మరియు వాయిస్ అఫ్ హైదరాబాద్ సీసన్ 6 విన్నర్ బేబీ సోనాలిక పాటలు ఆహుతులను అదరహో అనిపించాయి. చిన్నారుల పాటలుతో ఆడిటోరియం కళకళలాడింది సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన సంక్రాంతి సందడి మలేషియా లో కనిపించింది.
మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు అక్కునాయుడు గారు మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం సంక్రాతి ని పెద్ద పండగ గా ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు, ఆ తర్వాత వందేమాతరం శ్రీనివాస్ గారిని మరియు ఇండియన్ హై కమిషనర్ శ్రీ బి న్ రెడ్డి సన్మానించారు.
ఈ కార్యక్రమములో మలేషియా తెలుగు ఫౌండేషన్ దాతో కాంతారావు అక్కునాయుడు మరియు వారి కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు , ట్రేసరర్ స్రీన్ జివి , కే ల ఎక్సకో జగదీష్ రావు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z