ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లో ఆర్ధికాంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనిల్ గ్రంథి ఈ సదస్సులో తెలుగువారికి ఆర్ధికపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. పన్ను రిటర్న్ దాఖలు, ఆర్ధిక ప్రణాళికలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, విద్యుత్ వాహనాలపై వచ్చే పన్ను ప్రయోజనాలు, వంటి అంశాల గురించి వివరించారు. శ్రీహరి మందాడి ఈ సదస్సును సమన్వయపరిచారు.
శ్యామ్ నాళం, టి.పి. రావు, బిందు యలమంచిలి, మురళీ కృష్ణ మేడిచెర్ల, సురేష్ బొల్లు, బస్వ శేఖర్ శంషాబాద్, మోహన్ కుమార్ వెనిగళ్ల, దేసు గంగాధర్, రమేష్ నూతలపాటి,చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, చక్రధర్ వోలేటి, డా. సూర్యం గంటి, జగదీష్ ఎలమంచిలి తదితరులు సహకరించారు. నాట్స్ బోర్డు అధ్యక్షుడు పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు బాపు నూతి, మాజీ అధ్యక్షురాలు అరుణ గంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z