సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ తీర్మానాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 2లక్షల ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచి ప్రక్రియ మొదలైందని వివరించారు. గత పాలనలో రాచరిక పోకడలే తప్ప.. తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదన్నారు.
*** కేబినెట్ కీలక నిర్ణయాలివే..
-> తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం.
-> వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్.. టీజీగా మార్పు.
-> రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’.
-> ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ. రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం.
-> రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం.
-> అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం.
-> కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
-> తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం
-> 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్ చేయాలని నిర్ణయం.
-> సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z