మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
దిన ఫలం:-నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.పలుకుబడి కలిగిన వ్యక్తి తో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది.కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయివిందు వినోదాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
దిన ఫలం:-అధికారుల వలన ఇబ్బందులు.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటాయి.వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును.అధికారులు తో నూతన సమస్యలు రాగలవు. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
దిన ఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.నిలిచిన పనులు పూర్తి కాగలవు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది .నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వ్యవహారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.ఆరోగ్యంగా ఉంటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.సహోద్యోగులతో స్నేహభావం అవసరం. అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగుల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలు లో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.ఓం మారుతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
దిన ఫలం:-మానసికంగా ప్రశాంతత లభిస్తుంది . ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.పనిలో ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు.పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలం.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తి తో పరిచయాలు ఏర్పడతాయి.అందరి సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.ఓం మణికంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
దిన ఫలం:-పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక లావాదేవీలు లో అప్రమత్తత అవసరం. ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది.అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి.ఓం సోమాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
దిన ఫలం:-కుటుంబ విషయాలు చికాకుగా ఉంటాయి. వ్యవహారాలు లో పెద్దల సలహా తీసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.ఉద్యోగులు పని భారం పెరిగి నా బాధ్యత తో నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సఖ్యత గా ఉండాలి.కష్టానికి తగిన ఫలితాలను పొందగలరు. స్నేహితులతో అనవసరమైన వివాదాలు ఏర్పడవచ్చు. వ్యాపారులకు అనుకూలం.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
దిన ఫలం:-అనుకోని ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఉద్యోగాలు లో పని ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
దిన ఫలం:-కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి .వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు పొందవచ్చు. కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి.పలు మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం..శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్ని సమస్యలనూ అధిగమిస్తారు. కాని పనులు వాయిదా పడతాయి.వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు.ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
దిన ఫలం:-వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వింటారు. ఓం శాంకర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
దిన ఫలం:-తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తవుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగుల సహకారంతో పనులు చక్కబడతాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం.వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు.కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఓం కామాక్షిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z