Politics

అర్జునుడు కాదు అక్రమార్జునుడు-తాజావార్తలు

అర్జునుడు కాదు అక్రమార్జునుడు-తాజావార్తలు

* మూడు రాజధానులు వద్దని సీఎం జగన్‌కు తాను ముందే చెప్పానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. తన అనుచరులతో ఐతవరంలో సమావేశం ఏర్పాటు చేశారు. జగన్‌ ఎన్నికలకు ముందు ఉన్నట్టుగా.. తర్వాత లేరని చెప్పారు.

* క్యాన్సర్‌తో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యాధితో తనకు ఇష్టమైన తాతను సైతం కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. పోరాడితే క్యాన్సర్‌ను ఓడించవచ్చని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్పర్ష్ హోస్పైస్ నివాసితులతో పాటు సిబ్బందిని ఆయన కలిశారు.

* జైలులో ఉన్న ఆప్‌(AAP) నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) సోమవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌ ఆయన ప్రమాణానికి నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రివిలెజ్ కమిటీ ఆయనపై విచారణ జరుపుతోందని ఈ సందర్భంగా ధన్‌ఖడ్ వెల్లడించారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సంజయ్ సింగ్(Sanjay Singh) అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను ఆప్‌ మరోసారి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు ఏడురోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఫిబ్రవరి ఒకటిన సంజయ్‌.. దిల్లీ కోర్టును ఆశ్రయించారు. తర్వాత తన పిటిషన్‌ను వెనక్కి తీసుకొని. ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. జైలు అధికారులు పార్లమెంట్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన ఆయనకు నిరాకరణ ఎదురైంది. సంజయ్‌తో పాటు దిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్, నారాయణ్ దాస్‌ గుప్తా ఆప్‌ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వారి ప్రమాణస్వీకారం ఇప్పటికే పూర్తయింది.

* రాష్ట్రంలో డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రకటనను సోమవారం (ఫిబ్రవరి 5న) విడుదల కానుంది. ఆ రోజు నుంచే దరఖాస్తు స్వీకరిస్తారు. డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తీసుకురానున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్‌షిప్‌ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్‌, డీఎస్సీలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

* నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. బీఆర్ఎస్ చైర్మన్ రాజేందర్‌పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి చైర్మన్, వైస్ చైర్మన్లపై బల నిరూపణ పరీక్ష నిర్వహించారు. ఆర్డీవో రత్నకుమారి ఆధ్వర్యంలో ఈ బలనిరూపణ పరీక్ష జరిగింది. ఈ బలనిరూపణ పరీక్షలో మొత్తం 12 మంది కౌన్సిలర్లలో బీఆర్‌ఎస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు ఓటేశారు. బీఆర్ఎస్‌కు చెందిన చైర్మన్ రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్‌కు వ్యతిరేకంగా 9 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఒకటయ్యారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది.

* ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది. జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్‌‌మెంట్ ఇచ్చామని గవర్నర్ చెబుతుండగా టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పూర్తి రీయింబర్స్‌మెంట్ అంతా అబద్ధమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. 17 ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తగా పెట్టామని చెబుతుండగా కూడా టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశారు. నాడు నేడు కాదు అంతా అధ్వాన్నమే అంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపడంతో సభలో కొద్దిసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే గవర్నర్ కల్పించుకుని ‘‘నాకు త్రోట్ ఇరిటేషన్ ఉంది’’ అని చెప్పడంతో టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

* ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల తీరిక లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే రోజుకు మూడు జిల్లాల చొప్పున 9 రోజుల్లో సమీక్షలు పూర్తి చేసిన షర్మిల.. రెండో విడత టూర్ కు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలో ఇవాళ స్ధానికంగా పలు కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్న షర్మిల ఆకస్మికంగా వీటిని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న షర్మిల.. అనంతపురం టూర్ రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే జిల్లాల్లో పర్యటించి స్ధానిక పరిస్ధితుల్ని తెలుసుకున్న షర్మిల.. మరోవైపు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తీరిక లేని షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారు. అయితే అంతకు ముందు ఇంత సుదీర్ఘంగా తిరిగిన అనుభవం లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు వైరల్ ఫీవర్ సోకడంతో అనంతపురం టూర్ ను రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

* విశాఖపట్నం నుంచి బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతికి తిరుగుతున్న ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే అధికారులు పొడిగించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీటిని పొడిగించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లభించే ఆదరణను బట్టి భవిష్యత్తులో వీటిని నడిపించాలా? లేదా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. మార్చి 27 వరకు పొడిగించారు. విశాఖపట్నంలో రాత్రి 7.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

* విపక్షాలు చాలాకాలం అటువైపే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని, వారి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నానని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున… అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలని వారు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ లోక్‌సభలో (Loksabha) మాట్లాడారు. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి (Droupadi Murmu) వివరిస్తే.. దానిని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత వారంతా ప్రేక్షకుల సీట్లకే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి కోసమే వారు తీవ్రంగా కష్టపడుతున్నారని చురకలంటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ మహిళలు, యువత, పేదలు, రైతులపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది. మైనారిటీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయి. వారి తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ పాత్రను పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. వారసత్వమే కాంగ్రెస్‌ దుకాణం మూసివేతకు కారణమవుతోంది. దానికి మల్లికార్జున ఖర్గే, ఆజాద్‌ బాధితులయ్యారు’’ అని విమర్శించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు, హోం మంత్రి అమిత్‌షాకు సొంత పార్టీలేమీ లేవని వ్యాఖ్యానించారు.

* వైకాపా పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. సీఎం జగన్‌ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని.. వైకాపాను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా పాలన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘వైకాపా (YSRCP) అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లు దోపిడీ జరిగింది. సీఎం జగన్‌ (YS Jagan) రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. జగన్‌ అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు. దేశ రాజకీయాల్లో ఇంత అక్రమంగా ఆర్జించే వారిని నేను చూడలేదు. రాష్ట్ర ప్రజలకు డబ్బులు కాదు.. దెబ్బల మీద దెబ్బలు ఇచ్చారు. మద్యం దోపిడీతో ఈ జగన్‌ జలగ.. జనం రక్తం తాగుతోంది. విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. రూ.64 వేల కోట్ల మేర విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఆయన మళ్లీ జైలుకు వెళ్తే ఆ అప్పులన్నీ ప్రజలే కట్టాల్సి వస్తుంది. ఒక్క ఛాన్స్‌ అని చెప్పి ప్రజలను గోదావరిలో ముంచేశారు. వైకాపా పాలనలో ప్రజల సంపదంతా ఆవిరైంది.. అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది.” అని చంద్రబాబు అన్నారు.

* రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ (ఛొంగ్రెస్స్) అగ్రనేత రాహుల్‌ గాంధీ (ఋఅహుల్ ఘంధి) కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ (ఈణ్డీఆ) కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని చెప్పారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని తెలిపారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (భరత్ ఝొదొ ణ్యయ్ Yఅత్ర)లో భాగంగా ఝార్ఖండ్‌ (ఝర్ఖంద్)లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈసందర్భంగా సైకిల్‌పై బొగ్గు తీసుకెళుతున్న యువతతో కాసేపు ముచ్చటించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z