WorldWonders

భారత CEOల వాచీలు కొట్టేస్తున్న లండన్ దొంగలు

భారత CEOల వాచీలు కొట్టేస్తున్న లండన్ దొంగలు

భారత్‌లోని పలు కంపెనీల సీఈవోలు బ్రిటన్‌ షాడో విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీతో సమావేశమైనట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఈ భేటీలో లండన్‌లో జరుగుతున్న వాచ్‌ దొంగతనాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. సమావేశాలు, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చినప్పుడు తమవద్ద ఉండే ఖరీదైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు వారు ఆరోపించారు. దీనిపై దిల్లీకి చెందిన ఓ సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘‘ఇటీవల లండన్‌లో పర్యటించిన భారతీయ సీఈవోలలో చాలామంది దోపిడీకి గురయ్యారు. వారివద్ద ఉండే లగ్జరీ వాచ్‌లు, ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. దీనిపై లండన్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మాకు సౌకర్యంగా లేని ప్రాంతానికి ఎందుకు వెళ్లాలి? ఈ విషయమై బ్రిటన్‌ ప్రభుత్వానికి మా ఆందోళన తెలియజేశాం’’ అని అన్నారు. లండన్ నగరంలో 2022తో పోలిస్తే.. గతేడాదిలో వాచ్‌, మొబైల్‌, హ్యాండ్‌బ్యాగ్‌ దొంగతనాలు 27 శాతం మేర పెరిగినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. గత ఐదేళ్లలో సుమారు 29 వేల లగ్జరీ వాచ్‌లను దొంగతనం చేసినట్లు వెల్లడించింది. 2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z