ScienceAndTech

1000 డిగ్రీల వేడిని తట్టుకునే పదార్థం అభివృద్ధి

1000 డిగ్రీల వేడిని తట్టుకునే పదార్థం అభివృద్ధి

1000 డిగ్రీల సెల్సియస్‌ వద్ద..ఎంతటి కఠినమైన పదార్థమైనా తన స్వరూపాన్ని, స్వభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ విషయంలో పరిశోధకుల ప్రయోగాలు ఫలించాయి. వెయ్యి డిగ్రీల సెల్సియస్‌ వేడిని తట్టుకునే మెటీరియల్‌ను కొరియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. విమానయానం, అంతరిక్ష ప్రయోగాలు, సోలార్‌ ప్యానెల్‌ తయారీ.. తదితర వాటిల్లో కొత్త మెటీరియల్‌ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టంగ్‌స్టన్‌, నికెల్‌, టైటానియం నైట్రేడ్‌ లోహాలతో తయారైన ఈ కొత్త మెటీరియల్‌.. అత్యధిక వేడి, అతినీల లోహిత కిరణాల రేడియోషన్‌ను తట్టుకోగలదని పరిశోధకుల బృందం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z