నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీలో కలిశారు. టీడీపీలో చేరిక, పోటీపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ టికెట్ ను మరోసారి లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. గుంటూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని చెప్పింది. అయితే, అందుకు శ్రీకృష్ణ దేవరాయలు ఒప్పుకోలేదు. ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడాయన టీడీపీ వైపు చూస్తున్నారు. పొత్తుల అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం అయ్యారు. గంటన్నరపాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z