వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్) అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లో (పీపీఎ్‌సఎల్) చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేల నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా పేమెంట్ అగ్రిగేటర్‌గా పని చేయడానికి లైసెన్సు కోసం పీపీఎ్‌సఎల్ 2020 నవంబరులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేసింది. అయితే 2022 నవంబరులో ఆర్‌బీఐ ఆ దరఖాస్తును తిరస్కరిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలకు కట్టుబడుతూ మరోసారి దరఖాస్తు సమర్పించాలని పీపీఎ్‌సఎల్‌ను ఆదేశించింది. వాస్తవానికి ఓసీఎల్‌లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్ పెట్టుబడులున్నాయి. ఈ మేరకు ప్రెస్‌నోట్ 3కి కట్టుబడుతూ ఓసీఎల్ నుంచి తమకు అందిన పెట్టుబడులకు ఆమోదముద్ర పొందడం కోసం 2022 డిసెంబరు 14వ తేదీన పీపీఎ్‌సఎల్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పీపీఎ్‌సఎల్‌లో చైనా పెట్టుబడుల వ్యవహారం అంతటినీ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఒకటి పరిశీలనకు చేపట్టింది. కొవిడ్-19 అనంతర కాలంలో దేశీయ కంపెనీల అవకాశవాద టేకోవర్లను నిరోధించడం లక్ష్యంగా ఏ రంగంలోని కంపెనీలో అయినా భారతదేశ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి ఎఫ్‌డీఐలు స్వీకరించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ప్రెస్‌నోట్ 3 నిర్దేశిస్తోంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, అప్ఘనిస్థాన్.. మన దేశంతో భూసరిహద్దు పంచుకునే దేశాలు.
కాగా ఈ వ్యవహారంపై పీపీఎ్‌సఎల్ ప్రతినిధి ఒకరిని సంప్రదించగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సుకు ఎవరు దరఖాస్తు చేసినా ఎఫ్‌డీఐ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని, తమ విషయంలో కూడా ప్రస్తుతం జరుగుతున్నది రెగ్యులర్ ప్రాసె్‌సలో భాగమేనని వ్యాఖ్యానించారు. పీపీఎ్‌సఎల్ అన్ని మార్గదర్శకాలను అనుసరించిందని, అవసరమైన పత్రాలన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితిలోగా రెగ్యులేటర్‌కు సమర్పించిందని ఆయన చెప్పారు. ‘‘అప్పటి నుంచి యాజమాన్య నిర్మాణంలో మార్పు వచ్చింది. పేటీఎం వ్యవస్థాపకుడు కంపెనీలో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు. 2023 జూలైలో ఓసీఎల్‌లో తన వాటాను యాంట్ ఫైనాన్షియల్ 10 శాతం కన్నా తగ్గించుకుంది. ఈ కారణంగా ఇది ప్రయోజనం పొందిన కంపెనీ యాజమాన్యం వర్గీకరణలోకి రాదు. ఓసీఎల్ వ్యవస్థాపక ప్రమోటర్‌కు ప్రస్తుతం 24.3 శాతం వాటా మాత్రమే ఉంది. అందువల్ల చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్న మీ అవగాహన పూర్తిగా తప్పు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఓసీఎల్ అసోసియేట్ కంపెనీ అయిన పీపీబీఎల్‌పై గత నెలలో ఆర్‌బీఐ కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z