* మన దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. జనవరి 15 నుంచి జులై 15 వరకు దేశం మొత్తం మీద సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్’ (CAIT) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. దీని ద్వారా దేశంలో బిజినెస్ పెద్ద ఎత్తున జరిగే సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులై 15 వరకు జరిగే పెళ్లిళ్ల ద్వారా సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ వెల్లడించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రమే 4 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార ఆదాయం సమకూరుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.
* పేటీఎంపై ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బంపరాఫర్ ఇచ్చింది. ఆర్‌బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ప్రకటించారు.
* ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేటీఎంపై ఆర్‌బీఐ నియంత్రణ చర్యల్ని సమీక్షించబోమని తెలిపారు. ఇటీవల ఆర్‌బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. యూజర్ల అకౌంట్లు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు,ఫాస్టాట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయకూడాదని ఆర్‌బీఐ తెలిపింది.
* భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సిస్టం.. ఈ రోజు శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వర్చువల్ కార్యక్రమం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ పాల్గొన్నారు. శ్రీలంక, మారిషస్ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలోనే ఇండియాకు చెందిన సేవలు ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ రోజే శ్రీలంకలోని భారతీయుడు తొలి యూపీఐ లావాదేవీలను నిర్వహించారు. యూపీఐ లావాదేవీలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయాలనే ‘నరేంద్ర మోదీ’ కల మెల్ల మెల్లగా నెరవేరుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z