NRI-NRT

తెలుగు పల్లె ఉత్సవాన్ని తలపించిన CAA సంక్రాంతి

తెలుగు పల్లె ఉత్సవాన్ని తలపించిన CAA సంక్రాంతి

చికాగో ఆంధ్ర సంఘం (CAA) సంక్రాంతి వేడుకలు “పల్లె సంబరాలు” పేరిట ఆదివారం నాడు హిందు టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో (HTGC) ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు కృష్ణ మతుకుమల్లి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది. పెద్దసంఖ్యలో చికాగో పరిసర ప్రాంత ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాన్సలేట్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా (Consulate General of India) సోమ్నాధ్ ఘోష్ ముఖ్య అతిధిగా విచ్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్న్నారు. హేమంత్ తలపనేని ఆధ్వర్యంలో, శైలేష్ మద్ది, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, విజయ్ మన్నేపల్లి, దివిజ చల్లా,‌ శ్రియ కొంచాడ, స్మరణ్‌ తాడేపల్లి, శిరీషా పద్యాల, అన్వితా పంచాగ్నుల అతిథులను ఆహ్వానించి, క్యాలెండర్, రాములోరి అక్షింతలు అందజేశారు.

దీపప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భారత భారతీ మ్యూజిక్ స్కూల్ వల్లీశ్వరి మూర్తి, గురుకృప మ్యూజిక్ స్కూల్ వైదేహి చంద్రశేఖరన్, గురు జానకి ఆనందవల్లి నాయర్, గురు శోభ తమ్మన, గురు ఆశా అడిగ ఆచార్య విద్యార్థులు సాంప్రదాయ సంగీత ప్రార్థనా గీతాలు, నృత్యాలు అలరించాయి. కల్చరల్ టీం శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అనూష బెస్త సమన్వయించగా, శ్రీనివాస్ పద్యాల, శిల్పా రామిశెట్టి, లోహిత గంపాల, ప్రియ మతుకుమల్లి, మనస్వి తూము, గీతిక ఐనపూడి, హాసిని దేవెళ్ళ సహకరాన్నందించారు. వేణుగోపాల్ పోకల, శ్రీలక్ష్మి చిట్టినేనిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ‘పల్లె సంబరాలు’ ప్రత్యేక ప్రదర్శనలో 70 మంది బాలబాలికలు, పెద్దలు అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా వీనులవిందైన పాటలతో, తెలుగింటి ఆచారాలను వాటిలోని విశిష్టతను కళ్ళకు కట్టినట్లు చూపించే సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించారు. గీతిక మండల Facebook live నిర్వహించారు.

లక్ష్మీనాగ్ సూరిభొట్ల, ప్రభాకర్ మల్లంపల్లి, “ఆనంది” కల్పన, తమిశ్ర కొంచాడ, కృష్ణ జాస్తి, కావ్య శ్రీ చల్ల, మనస్వి తూము, నరేష్ చింతమాని, సురేశ్ ఐనపూడి, సుజాత అప్పలనేని, భాగ్యలక్ష్మి సంగెం, శృతి కూచంపూడి, సౌమ్య బొజ్జ, స్రవంతి గ్రంధి, ప్రియ మతుకుమల్లి, మల్లీశ్వరి పెదమల్లు, హరిణి మేడ, రాజ్యలక్ష్మి కొండిశెట్టి, అనూష బొజ్జ తదితరులు వేడుక విజయవంతానికి కృషి చేశారు. చైర్మన్ గా పని చేసిన సుజాత అప్పలనేనిని సత్కరించారు. సంస్థ ట్రస్టీలు శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, సుజాత-పద్మారావు అప్పలనేని, రాఘవ-శివబాల జాట్ల, దినకర్-పవిత్ర కరుమూరి, ఉమ కటికి కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలా తమ సహకారాన్నందించారు. చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సవితా మునగ వివరించారు. సంస్థ కార్యదర్శి గిరి రావు కొత్తమాసు ధన్యవాదాలు తెలిపారు.




👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z