NRI-NRT

దక్షిణాఫ్రికాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

దక్షిణాఫ్రికాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఈ నెల 17న దక్షిణాఫ్రికాలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ దేశ బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, డర్బన్‌ రాష్ట్రాల్లో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న దక్షిణాఫ్రికాలోని మూడు రాష్ట్రాల్లోగల అనాథాశ్రమాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. చ‌లో న‌ల్లగొండ స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన విషయానని గుర్తుచేశారు. తెలంగాణను కాపాడి, మన హక్కులను రక్షించేది మన కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z