ScienceAndTech

పిజ్జా ATM ప్రారంభం

పిజ్జా ATM ప్రారంభం

డబ్బుల ATM చూశారు. గోల్డ్‌ ఏటీఎంను చూశారు. పిజ్జా ఏటీఎం కూడా వచ్చేసింది. కేవలం మూడే మూడు నిమిషాల్లో వేడి వేడి పిజ్జా మనకందించే ఏటీఎం.

ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి స్పీడీ పిజ్జా మెషిన్ ఇది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు సమీపంలో ఇది కొలువు దీరింది. యమ్మీ యమ్మీ పిజ్జా కేవలం 3 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. ఈ ప్రత్యేకమైన ఆలోచన ఫ్రాన్స్‌ ప్రేరణగా వచ్చిందని ఐమ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లైసెన్స్ పొందిన డాక్టర్ రోహిత్ శర్మ వెల్లడించారు. తమ మొహాలీ ఆధారిత ఫ్యాక్టరీలో యంత్రాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారట. గత నెలలో దీన్ని ఇన్‌స్టాలేషన్ చేసినప్పటినుంచీ విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నారు ఆయన. ప్రస్తుతం రోజుకు సగటున 100 దాకా ఆల్ వెజిటేరియన్ పిజ్జాలను సిద్ధం చేస్తోంది. వారాంతాల్లో, ఈ సంఖ్య 200-300 మధ్య ఏదైనా పెరుగుతుంది. ఇది కేవలం మొట్టమొదటిది, కొత్తదనంతో కూడుకున్నది మాత్రమే కాదని, డొమినోస్, పిజ్జా హట్ లాంటి వాటితో పోలిస్తే దాదాపు 35శాతం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఇన్‌స్టాల్‌ చేస్తామని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z