ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి ఐటీ కంపెనీలు. ఈ విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ముందు వరుసలో ఉండగా.. మిగిలిన కంపెనీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విషయమై తాజాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 19 నుంచి డీఎఫ్‌ఎస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొంది. నిర్దేశించిన కార్యాలయాలకు హాజరుకావాలని, కనీసం మూడు రోజులు చొప్పున పనిచేయాలని అందులో తెలిపింది. ఉద్యోగుల రోస్టర్ వివరాలను మేనేజర్లు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ప్రస్తుతం డీఎఫ్‌ఎస్ డివిజన్‌లో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు మాత్రం వారానికి ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిఉంటుందని ఐటీ కంపెనీ స్పష్టం చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z