Politics

జగన్‌కు హైకోర్టు నోటీసులు-NewsRoundup-Feb152024

జగన్‌కు హైకోర్టు నోటీసులు-NewsRoundup-Feb152024

* గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

* ఏఐకేఎంఎస్, సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ శ్రేణులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతాంగంపై విధించిన నిర్బంధాలపై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్వామినాథన్ సిఫార్సు కమిటీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. కొండేబోయిన నాగేశ్వరరావు, కే నరేంద్ర, వై. ప్రకాష్, బోళ్ల రామస్వామి, గుగులోతు తేజ నాయక్, దేవ ప్రకాష్ పాల్గొన్నారు.

* నరసరావుపేట ఎంపీ, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు త్వరలో తెదేపాలో చేరనున్నారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరేందుకు ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వందల సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో ఉండవల్లి కరకట్టపై రాకపోకలు నిలిచిపోయాయి.

* వైకాపా రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు (అడ్వర్టైజ్‌మెంట్లు) ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఇకపై జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది.

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) రాజాంలో ‘శంఖారావం’ సభ నిర్వహిస్తున్నారు.

* తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (TS Assembly Session) కాగ్ రిపోర్టును (CAG Report) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను కాగ్ రిపోర్ట్‌ పొందుపరిచింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా అంచనా వ్యయం రూ.1,06,000 కోట్లకు పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది. రూ.87 వేల కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని, బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది. రుణాలు చెల్లింపులో కాలయాపన చేసిందని ప్రస్తావించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, రుణాల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో vivariMciMdi.

* తమ పార్టీ బహిష్కరించిన మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం(Former CM O. Panneerselvam) సీటును తన పక్కనుంచి మార్చాలంటూ అన్నాడీఎంకే అధినేత, శాసనసభ ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి చేసుకున్న వినతి పట్ల అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు ఎట్టకేలకు స్పందించారు. ఓపీఎస్‌ సీటును ఈపీఎస్‌ వెనుక వరుసలోకి మారుస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఓపీఎస్‌ మద్దతుదారుడైన మనోజ్‌పాండ్యన్‌ సీటును నాల్గో వరుసకు మార్చారు. గతంలో అన్నాడీఎంకే మాజీ స్పీకర్‌ ధనపాల్‌కు కేటాయించిన 207వ నెంబరు సీటును ఓపీఎ్‌సకు కేటాయించారు. ఓపీఎస్‌ ఇప్పటి వరకూ కూర్చున్న సీటును అన్నాడీఎంకే ఉపనేత ఆర్‌పీ ఉదయకుమార్‌కు కేటాయించారు. 2021లో ఓపీఎ్‌సను తమ పార్టీ నుంచి బహిష్కరించిన అనంతరం శాసనసభలో ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తప్పించాలని, ఆయన స్థానాన్ని కూడా తన పక్క నుంచి మార్చాలంటూ నాలుగుమార్లు లేఖలు రాసిన ఈపీఎప్‌… పలుమార్లు స్పీకర్‌ను నేరుగా కలుసుకుని విజ్ఞప్తి చేశారు. అయినా అటునుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం మళ్లీ శాసనసభలో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ సైతం జోక్యం చేసుకుంటూ ఈపీఎస్‌ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌కు విన్నవించిన విషయం తెలిసిందే.

* తూర్పు నియోజక వర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ఆహ్వానించడానికి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ… తాను, ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉన్నామని, గతంలో వేర్వేరు పార్టీల నుంచి తాము పోటీ చేసినా ఇద్దరమూ వ్యక్తిగతంగా తిట్టుకోలేదన్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అక్రమాలపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. విశాఖ ఎంపీ అక్రమాలపై ఎంపీ విజయ సాయి రెడ్డి ఆరోపణలు కూడా చేశారన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఎంపీ సత్యనారాయణ అక్రమాలపై విచారణ జరిపిస్తామని వెలగపూడి రామకృష్ణ బాబు స్పష్టం చేశారు.

* హిందూపురం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో పర్యటిస్తున్న భువనేశ్వరి… ఓ చిన్నారికి నామకరణం చేశారు. సింగనమల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులకు మగ పిల్లాడు జన్మించాడు. హిందూపురంలో నిజం గెలవాలి కార్యక్రమం వద్దకు హేమంత్ యాదవ్ దంపతులు తమ బిడ్డతో వచ్చారు. తమ బిడ్డకు నామకరణం చేయాలని హేమంత్ యాదవ్ దంపతులు కోరారు. దీంతో ‘కుశల్ కృష్ణ’ అంటూ చిన్నారికి భువనేశ్వరి నామకరణం చేశారు. తమ బిడ్డకు భువనేశ్వరి నామకరణం చేయడం పట్ల హేమంత్ యాదవ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

* కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ‘‘భారాస కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించి భారాసను గద్దె దించారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదు. దోచుకున్నది.. దాచుకోవడంపైనే దృష్టిపెట్టారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. కాగ్‌ నివేదికను సభలో పెట్టాం. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. అధికారమిస్తే చేసి చూపిస్తానంటున్నారు హరీశ్‌రావు. పదవి రావాలంటే ఆయన మరో ఔరంగ జేబు అవాతరం ఎత్తాల్సిందే.

* ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పట్లేదన్నారు.

* క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. పొత్తుల విషయంలో పైస్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, అవినీతి పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు ఓట్లు ఉండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల కుటుంబం డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z