* తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల అధికారులు బోన్‌లో బంధించారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్టు విచారణలో తేలింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38)గా గుర్తించారు.
* హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.7 కోట్లకు ఒప్పదం కుదిరిందని పేర్కొన్నారు. విడతల వారీగా రూ.4 కోట్లు, రూ.3 కోట్లు చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. కానీ, కోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయవాది వెంకటరమణను.. యాదగిరి కోరారు. రూ.కోటి ఇచ్చారని, మిగలిన మొత్తం ఇవ్వకుండా మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా, మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు సీపీఎస్ పోలీసులను ఆశ్రయించగా.. ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానిక భవనం వారి వీధిలో నివాసముంటున్న రామిశెట్టి అలేఖ్య (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. చేశారు. గురువారం ఉదయం తన గదిలో రక్తపు మడుగులో పడిఉన్న అలేఖ్య మృతదేహాన్ని గుర్తించిన ఆమె భర్త రమేశ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న టూటౌన్ పోలీసులు వివరాలు సేకరించారు. గత కొన్నేళ్లుగా అన్నెం శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని.. కేసులు కూడా పెట్టామని మృతురాలి భర్త రమేశ్ పోలీసులకు తెలిపారు. ‘‘నా భార్యను శ్రీనివాస్ తరచూ వేధించేవాడు. ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడు. మమ్మల్ని చంపుతామని పలుమార్లు బెదిరించాడు. అతడిపై కేసులు పెట్టాం. శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఇలా చేశాడు. బెదిరింపుల వరకే ఆగుతాడు అనుకున్నాం.. కానీ, ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదు’’ అని రమేశ్ పోలీసులకు వివరించాడు. గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో గొంతు కోయడంతోనే తీవ్ర గాయమై అలేఖ్య చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని సీఐ సుధాకర్ తెలిపారు. హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే ఇలా చేసినట్లు తెలుస్తోందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు.
* జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడిని కుత్బుల్లాపూర్ రామకృష్ణ నగర్‌లో కట్టెల మండి నిర్వహిస్తున్న జానయ్యగా గుర్తించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z