పొత్తులు ఉన్నందున టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. ‘‘జగన్‌తో విసిగిపోయిన వైకాపా నేతలు తెదేపాలో చేరుతామంటున్నారు. మంచివారు, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నాం. అలాంటి చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలి. ‘రా.. కదలిరా’ సభలు ముగిశాక ప్రజాచైతన్య యాత్రకు ప్రారంభిస్తా. ఎన్నికలకు 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలి. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఈ సభలు నిర్వహించాలి. జగన్ మోసం చేశారనే భావన ప్రతి వ్యక్తిలో ఉంది. బీసీల అభ్యున్నతికి ఏర్పడిన తెదేపాలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదు’’ అని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z