* కోచ్ జైసింహపై మహిళా క్రికెటర్లు హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని అందులో పేర్కొన్నారు. బస్సులో మద్యం తాగి తమను దూషించాడని మహిళా క్రికెటర్లు గత నెల 12న మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హెచ్‌సీఏ విచారణకు ఆదేశించింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను కోచ్ ఖండించాడు. మరోవైపు కోచ్ జైసింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ బాధ్యతల నుంచి ఆయన్ను తక్షణమే తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు తెలిపారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. వారికి హెచ్‌సీఏ అండగా ఉంటుంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం. విచారణ ముగిసే వరకూ కోచ్ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం’’ అని జగన్మోహన్‌రావు వెల్లడించారు.
* ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. వందల మంది పాదచారులు చూస్తుండగా రోడ్డుపై చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాడు. దాంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.
* న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఈఈట్ డెళి)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (శ్తుదెంత్ శుఇచిదె). గురువారం రాత్రి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణం చెందినట్లు పోలీసులు శుక్రవారం ఉదయం తెలిపారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన సంజయ్ నెర్కర్ (24) ఢిల్లీ ఐఐటీలో ఎమ్‌టెక్ (ంటెచ్) చేస్తున్నాడు. అతడు ద్రోణాచార్య హాస్టల్‌లోని రూమ్ నంబర్ 757లో ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నెర్కర్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళన చెంది హాస్టల్ సిబ్బందిని సంప్రదించారు. సిబ్బంది వెంటనే నెర్కర్ రూమ్ వద్దకు వెళ్లి చూడగా లోపల నుంచి గడియపెట్టి ఉంది. తలుపులు ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. నెర్కర్ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది కనిపించాడు.
* దొంగల రకరకాల మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెర తీస్తూనే ఉన్నారు. తాజాగా ఏటీఎంలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోగల దస్నాపూర్ ఏటీఎంలో ముగ్గురు దుండగులు నయా తరహా మోసానికి పాల్పడ్డారు. ఏటీఎంలో నగదు బయటకు వచ్చే ప్రదేశంలో ప్లాస్టర్‌ను ఎవరికీ అనుమానం రాకుండా అంటించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన సతీష్ దేశ్‌పాండె ఆ ఏటీఎంకు వెళ్లి రూ.5 వేలు డ్రా చేశారు. ఎంతకీ నగదు బయటకు రాలేదు. ఆయన ఖాతా నుంచి మాత్రం రూ.5 వేలు డెబిట్ అయినట్లు చరవాణికి సమాచారం వచ్చింది. దీంతో ఆయన బ్యాంకు యాజమాన్యానికి, మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z