Business

2024లో ₹70వేలకు 10గ్రాముల బంగారం ధర

2024లో ₹70వేలకు 10గ్రాముల బంగారం ధర

బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాములకు రూ.70 వేలకు చేరుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంతగా పెరగదని ముందుగా భావించారు. అయితే, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, మార్కెట్ పోకడలను బట్టి ధర అంతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. బ్యాంక్ బజార్.కామ్ సీఈవో దీని గురించి పలు వివరాలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం పెరగడం, పలు దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వంటి వాటిని బట్టి చూస్తే బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ 10 గ్రాముల బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ.66 వేల మార్కు దాటవచ్చని, అయితే, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, రాజకీయ అనిశ్చితి వంటివి కుదటపడకపోతే రూ.70 వేలకు పెరగవచ్చని మరో విశ్లేషకుడు చెప్పారు. కాగా, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంతో పాటు అంతర్జాతీయంగా భౌగౌళిక ఉద్రిక్తతలు, మిలటరీ ఘర్షణలు వంటివి కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యే అవకాశం ఉంది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీరు వల్ల బంగార ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు బంగారం ఓ వరంలాంటిదని అంటున్నారు. పసిడి ఒక స్థిరాస్తి. అది ఆర్థిక సంక్షోభం సమయంలో ఆపన్న హస్తంలా మారుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z