Kids

ఐదేళ్లు కడితే చాలు.. ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌

ఐదేళ్లు కడితే చాలు.. ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల చదువుల కోసం దీర్ఘకాలంలో మదుపు చేయాలనుకునే వారి కోసం ‘అమృత్‌బాల్‌’ (ప్లాన్‌ నం.874) (LIC Amritbaal) పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. ఫిబ్రవరి 17 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.

ప్రధాన ఫీచర్లు..
పిల్లల ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రుల కోసం ఎల్‌ఐసీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అతితక్కువ పాలసీ చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. ఒకేసారి చెల్లించే ఆప్షన్‌ కూడా ఉంది. పైగా ఆకర్షణీయమైన గ్యారెంటీడ్‌ అడిషన్‌ (వెయ్యి రూపాయలకు రూ.80) అందిస్తారు. ప్రీమియం కాలవ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తం అవసరమయ్యే 18-25 ఏళ్ల వయసు మధ్య పాలసీ మెచ్యూర్‌ అవుతుంది. దీంతో చిన్నారుల ఉన్నత చదువులకు అవసరమయ్యే నిధిని సమకూర్చుకోవడానికి వీలు పడుతుంది. రైడర్లను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z