అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు.. జోడు ఎడ్ల సవారీ చేస్తున్నారు పవన్‌కల్యాణ్. సుజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. ఇందులో పవన్ మాఫియా డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కథ రీత్యా భయంకరమైన మాఫియా డాన్ అయిన పవన్‌కల్యాణ్, కొన్ని కారణాలవల్ల పదేళ్లపాటు మాఫియాకు దూరంగా ఉంటాడట.
అనూహ్యంగా పదేళ్ల విరామం తర్వాత మళ్లీ మాఫియాపై విరుచుకు పడి, శత్రుమూక అంతు చూస్తాడట. ఇదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని టాక్ నడుస్తున్నది. మరి అందులో నిజం ఎంతుందో తెలియాలంటే సెప్టెంబర్ దాకా ఆగాల్సిందే. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్‌రాజ్, అర్జున్ దాస్, షాన్ కక్కర్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యుసింగ్, అజయ్‌ఘోష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z