Politics

నవాజ్‌ షరీఫ్‌ రాజీ..

నవాజ్‌ షరీఫ్‌ రాజీ..

పాకిస్థాన్‌ రాజకీయాలను సైన్యం శాసిస్తుందనే మాట బహిరంగ రహస్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. నాలుగోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కలలు కన్న నవాజ్‌ షరీఫ్‌ (74) చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం వెనుక పాక్‌ ఆర్మీ హస్తం ఉన్నట్లు తేలింది. కుమార్తె మరియం (50) రాజకీయ భవిష్యత్తు కోసం పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సైన్యం మాటకు తలొగ్గి, ప్రధాని పదవికి తన సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ పేరును ప్రతిపాదించారు. ‘‘ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేయడంతో నవాజ్‌కు సైన్యం షరతులు విధించింది. ప్రధాని పదవి కావాలా?.. కుమార్తె పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలా? రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ప్రధాని పదవిని ఎంచుకుంటే.. 12 కోట్ల జనాభా గల కీలక ప్రావిన్సు పంజాబ్‌ సీఎం పగ్గాలు షెహబాజ్‌కు ఇవ్వాలని తెలిపింది. తన రాజకీయ వారసురాలైన మరియం భవిష్యత్తు కోసం నవాజ్‌ ప్రధాని రేసు నుంచి వైదొలిగారు’’ అని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ – నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z