మేషం
అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతనకార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభం
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.
మిథునం
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
సింహం
విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతనకార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కన్య
కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
తుల
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
వృశ్చికం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితి మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
ధనుస్సు
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
మకరం
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం
కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీనం
ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z