పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ సారి దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు క్రయ, విక్రయాలు జోరుగా సాగుతుండగా, మంగళవారం క్వింటాల్‌కు గరిష్ఠంగా 13,555 పలికింది. పసుపు కాడి (కొమ్ము)కు ఈ ధర పలుకడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి కాగా, కనిష్ఠంగా 4,012 వచ్చింది. పసుపు గోళ (మండ) క్వింటాల్‌కు గరిష్ఠంగా 11,111, కనిష్ఠంగా 5,012, పసుపు చూర క్వింటాల్‌కు గరిష్ఠంగా 12వేలు, కనిష్ఠంగా 7,111 పలికింది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 1601 క్వింటాళ్ల పసుపు క్రయ, విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z