* అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్ మినిట్స్ రిలీజ్‌తో పాటు, యూఎస్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది. ఈ క్రమంలో భారత్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.180 వరకు ఎగిసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస ఆరో రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ ఉదయం 73,267.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. సెన్సెక్స్ భారీగా పెరడంతో ఐటీ, ఫైనాన్షియల్, ఫార్మారంగాల భారీగా అమ్మకాలు జరిగాయి. దాంతో ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఒక దశలో 73,267.80 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. ఇంట్రాడేలో 72,450.56 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 434.30 పాయింట్ల నష్టంతో 72,623.09 వద్ద ముగిసింది.
* జీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ(Zee Company)లో సుమారు 2000 కోట్లు దారి మళ్లినట్లు తెలుస్తోంది. సోనీ గ్రూపు సంస్థతో ఇటీవల జీ కంపెనీ కలిసిన విషయం తెలిసిందే. సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిధుల దారిమళ్లింపుపై దర్యాప్తు చేపట్టింది. దానికి సంబంధించిన నివేదికను రిలీజ్ చేసింది. సుమారు 2000 కోట్లు ఆ కంపెనీ డైవర్ట్ చేసినట్లు తెలుస్తోందని సెబీ తెలిపింది. సెబీ అధికారులు అంచనా వేసి దాని కన్నా పది రెట్ల అమౌంట్ దారిమళ్లినట్లు సెబీ అంచనా వేస్తోంది. దారి మళ్లిన నిధులపై స్పష్టం లేదని, ఆ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సెబీ పేర్కొన్నది. జీ సంస్థ సీనియర్ అధికారులతో పాటు వ్యవస్థాపకులు సుభాశ్ చంద్ర, ఆయన కుమారుడు పునిత్ గోయంక, బోర్డు సభ్యులను సెబీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
* స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో పాపులర్ బ్రాండ్ నోకియా భారత్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో 250 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. నోకియా చేపట్టిన మార్పుల కారణంగా వందలాది ఉద్యోగులు కొలువులు కోల్పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. నోకియా 5జీ టెక్నాలజీ పట్ల భారత్‌లో డిమాండ్ తగ్గడంతో కంపెనీ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నోకియా టెక్నాలజీపై గతంలో భారీగా వెచ్చించిన కొన్ని బడా దేశీ కంపెనీలు ప్రస్తుతం దీనిపై మునుపటిలా ఖర్చు చేసేందుకు మొగ్గుచూపకపోవడంతో భారత్ మార్కెట్‌లో నోకియా నెగ్గుకురాగలగడం సంక్లిష్టంగా మారింది.
* భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ ‘టీసీఎస్’ (TCS) నోయిడాలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్‌లలో ఒకటి కానున్నట్లు సమాచారం. లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం రిటర్న్ టు ఆఫీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే TCS కంపెనీ తమ ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని ఫైనల్ వార్ణింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలం నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలోని అసోటెక్ బిజినెస్ క్రెస్టెరాలో ఉంది. ఆఫీస్ స్పేస్ అవసరాలకు ఐటీ కంపెనీలు ప్రధాన కారణమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు వల్ల రాబోయే రోజుల్లో ఆఫీసులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావడం మొదలుపెడితే.. ఆఫీస్ స్థలాలు ఎక్కువ అవసరమవుతాయి. దీంతో నోయిడా ప్రాంతంలో ఆఫీసులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జెన్‌పాక్ట్, సెలెబల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కూడా ఆఫీసు స్థలాలను లీజుకు తీసుకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z