NRI-NRT

టాంపాలో నాట్స్ యోగా తరగతులు

టాంపాలో నాట్స్ యోగా తరగతులు

నాట్స్ ప్లోరిడాలోని టంపాబేలో యోగా వర్క్ షాప్ నిర్వహించింది. స్థానిక శక్తియోగాలయతో కలిసి నాట్స్ ఏర్పాటు చేసిన ఈ యోగా వర్క్ షాప్‌ను టంపాబేలో ఉండే తెలుగువారు చక్కగా వినియోగించుకున్నారు. అనుభవజ్ఞులైన యోగా శిక్షకులు ఈ వర్క్ షాప్‌కు విచ్చేసి యోగా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు అనేక యోగాసనాలు నేర్పించారు. శారీరక, మానసిక శక్తికి ఎలాంటి ఆసనాలు వేయాలి.? ప్రాణాయమం ఎలా చేయాలి అనేది ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్న వారికి శిక్షణ ఇచ్చారు. యోగా ప్రతి రోజు దినచర్యలో భాగంగా మార్చుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని సూచించారు. ఈ కార్యక్రమం కోసం నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ తమ వంతు సహకారాన్ని అందించారు. శారీరక, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు యోగా వర్క్‌షాప్‌ను చేపట్టి దానిని విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. తెలుగువారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ టంపాబే విభాగం చేపట్టిన యోగా వర్క్‌షాప్‌ని విజయవంతం చేసిన టంపాబే నాయకులను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన, సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీకృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z