NRI-NRT

ప్రముఖ ప్రవాసాంధ్రుడు మన్నం వెంకటరమణ మృతి

ప్రముఖ ప్రవాసాంధ్రుడు మన్నం వెంకటరమణ మృతి

న్యూజెర్సీకి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు మన్నం వెంకటరమణ మృతి చెందారు. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ…గతవారం అమెరికా నుండి భారత్‌కు పయనమైన ఆయన విమానంలో గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో జేరిన ఆయన నేడు మరణించారు. వేలాదిమందికి ఆయన అమెరికాలో ఉపాధి కల్పించారు. ప్రకాశం జిల్లా దర్శి నుండి 2009లో తెదేపా నుండి వెంకటరమణ పోటీ చేశారు. అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని కాకుటూరివారిపాలెం అనే గ్రామం నుండి ఆయన కష్టపడి అమెరికాకు వచ్చారు. మన్నం వెంకటరమణ గీతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రవాసులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఫిబ్రవరి 13వ తేదీన న్యూయార్క్(JFK) నుండి ఇండియా బయల్దేరిన ఎమిరేట్స్ విమానం ఇటలీ-మాల్టా దేశాల మధ్య ఉండగా మన్నంకు తీవ్ర గుండెపోటు వచ్చింది. విమానయాన సిబ్బంది అత్యవసర వైద్యం అందించాలనే లక్ష్యంతో విమానాన్ని గ్రీస్ దేశంలోని ఏతెన్స్‌కు మళ్లించారు. ఏతెన్స్‌లోని ఆసుపత్రిలో వారంరోజులు పోరాడిన ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5:30గంతలకు మృతి చెందారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z